విమోచన యాత్రకు మంచి స్పందన

SMTV Desk 2017-09-09 14:39:57  BJP President Laxman, Media, Liberation day

హైదరాబాద్, సెప్టెంబర్ 09 : తెలంగాణ విమోచన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపే వరకు పోరాడతమని తెలిపారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ యాత్రతో తమ పోరాటం ఆగదని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించే వరకు ఈ ఉద్యమం ఆగదన్నారు.