ప్రత్యేక రాజ్యంలా గుర్మిత్ సింగ్ డేరా దారుణాలు

SMTV Desk 2017-09-09 13:52:20  haryana, punjab, chandigarh, dera baba, sirsa, gurmeeth singh

హర్యానా, సెప్టెంబర్ 9: తవ్విన కొద్ది బయటకు వస్తున్న గుర్మిత్ సింగ్ అరాచకాలు అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే సోదాలో డేరా ఆశ్రమంలో అస్థిపంజరాలు, నగదు, ప్లాస్టిక్ కరెన్సీ బయటపడ్డాయి. రెండో రోజు కొనసాగిస్తున్న తనిఖీలో డేరా లోనే సెపరేట్ జైలును, తన గది నుంచి సాధ్వి నివాస్ కు రహస్య మార్గం, గుర్మిత్ సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాకుండా ప్రత్యేక మందు గుండు ఫ్యాక్టరీను కూడా నడిపేవాడని, ఇంకా గుర్మిత్ అనుచరులు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అవయవాల మార్పిడి చేసేవారని పోలీసులు వెల్లడించారు.