రాష్ట్రాలకు పాకిన ప్రాంతీయవాదం

SMTV Desk 2017-09-09 12:23:34  Karnataka, Telugu Candidates, Competitive Exams, RRB Exam

బెంగుళూరు, సెప్టెంబర్ 9: దేశంలో ప్రాంతీయవాదం కట్టలు తెంచుకుంటుంది. గతంలో దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ జాడ్యం ప్రస్తుతం రాష్ట్రాలకు కూడా పాకింది. స్థానికేతరులు అనే కారణంతో కర్ణాటకలో ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పరీక్షలను రాసేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్ర అభ్యర్థులపై కన్నడిగులు దాడికి దిగారు. బ్యాంకు పరీక్షల నిమిత్తం హుబ్లీ వెళ్ళిన తెలుగువారిని స్టేషన్ లోనే అనేక మందిని నిర్బంధించారు. అంతేకాకుండా స్థానికేతరులకు లాడ్జీల్లో రూములు ఇవ్వకూడదని, ఆటోల్లో ఎక్కనివ్వరాదని హెచ్చరికలు సంధించారు. పరీక్ష సెంటర్ల వద్ద కూడా కాపు కాసి, ఇతర రాష్ట్రాల వారిని అడ్డుకుని కర్రలతో దాడి చేశారు. స్థానికేతరులు తమ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారంటూ హుబ్లీ, గుల్బర్గ, దావణగెరె, బెంగళూరులో కన్నడిగులు నిరసన కార్యక్రమాలకు దిగారు. కాగా, తెలుగువారు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న కన్నడవారే సమాచారం ఇవ్వడం గమనార్హం.