హైదరాబాద్ కు రోహింగ్యాల వలసలు..

SMTV Desk 2017-09-09 11:43:43  hyderabad, myanmar, rohingya, supreme court

హైదరాబాద్, సెప్టెంబర్ 9: మయన్మార్ లో అంతర్యుద్ద నేపధ్యంలో రోహింగ్యాల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ జిహాద్ పేరుతో భౌతిక దాడులకు తెగబడటంతో రోహింగ్యాలు రోడ్డున పడ్డారు. దీంతో రోహింగ్యాలు వేల సంఖ్యలో ప్రాణభయంతో భారత్ కు వలస వస్తున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ ప్రాంతాలకు వలసగా వస్తున్నారు. హైదరాబాద్ బాలాపూర్ లో 4,500 మంది రోహింగ్యాలను శరణార్దులుగా గుర్తించి వారికీ గుర్తింపు కార్డులు కూడా జారి చేశారు. రోహింగ్యాలను వెనక్కు పంపాలని సుప్రీంలో కేసు నమోదు చేశారు. దీనిపై ఈ నెల 12 న పూర్తి స్థాయి నివేదికను కేంద్రం ప్రభుత్వం సుప్రీంకు ఇవ్వనున్నది. ప్రభుత్వం పెద్ద మనుసుతో అర్ధం చేసుకోవాలని రోహింగ్యాల విజ్ఞప్తి చేస్తున్నారు.