టీటీడీ ఛైర్మన్‌ పదవి ఎవరికి..?

SMTV Desk 2017-09-09 10:58:19  Andhrapradesh Chief minister, TTD, Chairman of Tirumala Tirupati Devasthanam (TTD),Nandamuri Harikrishna

అమరావతి, సెప్టెంబర్ 9: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వ్యాపారవేత్త రవిశంకర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఇదే విషయమై నేడు ఏపీ ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో జీవో జారీచేయనున్నారు. ఈ పదవి కోసం నందమూరి హరికృష్ణతో పాటు పలువురు ప్రముఖులు కూడా బరిలో నిలిచారు. కాగా, తాజా ఊహాగానాల నేపధ్యంలో హరికృష్ణకు నిరాశ ఎదురుకానుంది. అయితే ఈయనకు ప్రతిష్టాత్మకమైన పదవులు కట్టబెట్టకపోవడం వెనుక బంధుత్వపరమైన సమస్యలు రావచ్చనే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త రవిశంకర్ టీటీడీ ఛైర్మన్‌గా నియామకమైతే, ఒక సంవత్సర కాలం ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. 19 మందితో కూడిన పాలకమండలిలో బోర్డు సభ్యులుగా సుధా కృష్ణమూర్తి, కోలా ఆనంద్, చింతల రామచంద్రారెడ్డి, రాఘవేంద్రరావు, ఎమ్మెల్యే కొండబాబు, కృష్ణమూర్తి లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎండోమెంట్ కమిషనర్ వైవి అనురాధ తదితరులు