బ్లాక్ టాబ్లెట్..బ్లాక్ మ్యాజిక్..బ్లాక్ హార్స్..డేరా ఆశ్రమంలో కొనసాగుతున్న సోదాలు..!

SMTV Desk 2017-09-09 10:52:33  haryana, punjab, chandigarh, dera baba, sirsa, gurmeeth singh

హర్యానా, సెప్టెంబర్ 9: హైకోర్టు ఆదేశాలతో డేరాలోని సిర్సా లో కర్ప్యూ కొనసాగుతుంది. 800 ఎకరాల డేరా హెడ్ క్వార్టర్స్ లో 5,000 మంది పోలీసులు, 40 మంది కమండోలు, డాగ్ స్క్వాడ్స్ మధ్య తనఖీలు లు చేపట్టారు. కర్ప్యూ లో డేరా సచ్చా సౌధలోని స్టేడియం, హాస్పిటల్స్, విద్యాసంస్థలు, రిసార్ట్ లు, భవనాలలో సోదాలు జరిగాయి. నిన్న ఆశ్రమంలో జరిగిన సోదాల్లో అస్థిపంజరాలు, డేరాల నిండా కండోమ్ లు కనిపించడ౦తో పోలీసులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. మొదట్లో సత్సంగాలు, ప్రవచనాలు, జరిగిన ఈ ఆశ్రమం ప్రస్తుతం డేరా అకృత్యాలకు నిలయంగా మారిపోయిందని తెలుస్తోంది. ఇంకా ఆశ్రమం నుండి డేరా కంప్యూటర్ లు, లాప్ టాప్ లు, హార్డ్ డిస్క్ లు, పెద్ద మొత్త౦ లో ప్లాస్టిక్ కరెన్సీ, నగదు, స్వాధీనం చేసుకున్నారు. గుర్మిత్ రామ్ రహీం బెడ్ రూమ్ నుంచి అమ్మాయిల గదిలోకి సొరంగ మార్గం, బ్లాక్ టాబ్లెట్ తో సాధువులను నపుంసకులుగా మార్చి వాళ్లను హతమార్చాడు. డేరా ఆశ్రమంలో రెండో రోజు విస్తృతంగా తనిఖీ లు కొనసాగుతున్నాయి.