చైనా దిగుమతులపై మరింత పన్ను విధించనున్న భారత్...!

SMTV Desk 2017-09-09 10:49:54  china, india, china india business, extra tax, india extra tax on china items

ఢిల్లీ సెప్టెంబర్ 9: చైనా నుంచి అనేక ఉత్పత్తులు మన దేశంలోకి దిగుమతి జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనా నుంచి అధికంగా దిగుమతి అవుతున్న స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తుల వలన భారతదేశ ఉక్కు పరిశ్రమ సంక్షోభంలో పడింది. దేశీయంగా తయారయ్యే స్టీల్, స్టెయిన్ లెస్ స్టీల్ ఉత్పత్తులకు ప్రయోజనం కలిగేలా కేంద్రప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది. ఈ మేరకు చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌక ఉత్పత్తులపై దృష్టి సారించింది. చైనా నుంచి భారతదేశంలోకి దిగుమతి అయ్యే కొన్ని స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి పన్నును పెంచేందుకు చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియాల నుంచి స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతుల పై యాంటీ డంపింగ్ సుంకాలను కూడా విధించింది. ఈ పన్నుల వలన దేశీయ ఉక్కు పరిశ్రమలకు కొంతమేర ప్రయోజనం కలగనున్నట్లు కేంద్రం తెలిపింది.