రజనీ కాంత్ ‘2.ఓ’ చిత్రీకరణ పూర్తి

SMTV Desk 2017-09-09 08:36:08  rajini kanth, robo 2, shankar, akshay kumar, ami jackson, ar rahman

చెన్నై సెప్టెంబర్ 9 : రజనీ కాంత్ లేటెస్ట్ సినిమా ‘2.ఓ’ , ఈ సినిమా పాటలను త్వరలోనే విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అక్టోబర్ నెల 27 వ తేదిన దుబాయిలోని బూర్జ్‌పార్క్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తుండటంతో సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని శంకర్ భారి గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! కానీ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనేది తెలుసుకోవాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుందని సమాచారం. జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా ఎ.ఆర్. రెహమాన్, ఇంకా హీరోయిన్ గా అమీ జాక్సన్ చేస్తున్నారు.