మణిరత్నం తరువాత సినిమా నాని తో

SMTV Desk 2017-09-08 23:13:09  maniratnam, nani, jyothika, nani next movie, ishwarya rajesh

హైదరాబాద్ సెప్టెంబర్ 9 : మణిరత్నం దర్శకత్వం లో ఒక సారైనా నటించాలని ప్రతి నటుడికి ఉంటుంది. ఆయన చిత్రంలో అవకాశం వస్తే ఎగిరి గంతేసి మరీ నటించడానికి రెడీ అవుతారు. మరి అలాంటి అవకాశమే ఇపుడు నాని కి వచ్చింది. మణిరత్నం ‘చెలియా’ తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్‌ లు నటించనున్నారు. ఈ చిత్ర దర్శక నిర్మాతలు కథానాయకుడు నానిని కలిసినట్లు తెలుస్తోంది. నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే..ఎవరి సినిమా చేయడానికైనా ముందు కథ వింటానని, కానీ మణిరత్నం చిత్రం మాత్రం అవకాశం వస్తే చాలు నటించడానికి రెడీ అని చాలా సార్లు చెప్పారు. ఆరు పాత్రల నేపథ్యంలో సాగే కథ ఇదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబరు నుంచి షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక చెప్పారు. మణిరత్నం ‘ఓకే బంగారం’లో దుల్కర్‌ సల్మాన్‌ పాత్రకు నాని డబ్బింగ్‌ చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘ఎం.ఎల్‌.ఎ’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోపక్క నాని హీరోగా ‘కృష్ణార్జున యుద్ధం’ తెరకెక్కనుంది.