పవన్ కళ్యాణ్ అన్నం తినట్లేదా?

SMTV Desk 2017-06-04 18:17:35  pawan kalyan, trivikram,

హైదరాబాద్, జూన్ 4 : సినిమా, సినిమాకి తమ హీరో నుండి ఏదైనా కొత్తగా ఆశిస్తూ ఉంటారు అభిమానులు. అయితే, హీరోలు కూడా సినిమా అనుకున్నప్పటి నుండి పూర్తయ్యే వరకు కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారు. అది ఆహారమే కావచ్చు లేదా ఆహార్యమే అయి ఉండొచ్చు. ఇప్పుడు అదే తోవలోకి వస్తారు మన పవర్ స్టార్. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్. ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నా, పవన్ ఎప్పుడు బరువుతో ఇబ్బంది పడిన సందర్బాలు లేవు. మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఇప్పుడు పవన్ కి పెద్ద సమస్యే వచ్చి పడింది అదేంటంటే, అన్నం తినడం వల్ల మొహం ఉబ్బి పోతుందట. నిజానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రా కూరగాయల భోజనం తప్ప వేరే ఆహారం పెద్దగా తీసుకోరని పవన్ అనుచరులు అంటున్నారు. పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు త్రివిక్రమ్, పవన్ ను అన్నం తినకూడదని సూచించారట. దీన్ని అంగీకరించిన పవన్ ఈ సినిమా పూర్తయ్యేవరకు తన ఆహారపు అలవాట్లల్లో తగిన జాగ్రతలు తీసుకుంటారని పవన్ అనుచరులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.