ఏఎన్నార్ అవార్డు రాజమౌళి ని వరించింది

SMTV Desk 2017-09-08 20:21:24  akkineni award, ss rajamouli, baahubali, nagarjuna

హైదరాబాద్ సెప్టెంబర్ 8 : ఈ సంవత్సరం లో వచ్చిన ఏకైక భారీ చిత్రం ‘బాహుబలి’. మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు నేషనల్ గా కూడా ఈ చిత్రమే అత్యధిక ఖర్చు తో నిర్మించబడింది. అదే విధంగా కలెక్షన్ల కూడా ఆ రేంజ్ లోనే వచ్చాయి, దాదాపు ఈ సినిమా పద్దెనిమిది వందల కోట్లు రాబట్టింది. ఇపుడు అవార్డ్స్ కూడా అదే రేంజ్ లో రాబోతున్నాయి. తాజా గా నాగార్జున రాజమౌళి కి ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డును రాజమౌళికి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసారు. ‘సినీ రంగంలో ఎంతో ప్రతిభ కనబరిచిన మన జక్కన్న రాజమౌళికి ఏఎన్నార్ అవార్డును ఇవ్వనుండటం మాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు శిల్పాకళావేదికలో జరగనున్న కార్యక్రమంలో గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గారు ఈ అవార్డును రాజమౌళికి అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. ఏఎన్నార్ అవార్డును మొదటగా 2006 వ సంవత్సరం లో దేవ్ ఆనంద్ కి ఇచ్చారు. ఆ తరువాత ఆ పరంపర కొనసాగుతూ వస్తుంది.