విమానం ఎక్కాలనుకుంటే ఇకపై షరతులు

SMTV Desk 2017-09-08 19:14:09  Aircraft, Chieftains, A member of the aircraft, Forwardness, Pilot complaint , Airlines

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 08 : ప్రజాప్రతినిధులు సహా విమానా సభ్యునితో దురుసుగా వ్యవహరించే సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటి నియంత్రణకు చర్యలు చేపట్టింది. దురుసు ప్రవర్తన స్థాయిని బట్టి ఆయా వ్యక్తులపై మూడు నెలల నుంచి జీవితకాల నిషేధం విధించేలా కేంద్ర పౌరవ విమానయాశాఖ పలు ప్రతిపాదనలు చేసింది. మూడు రకాలుగా ఉండే ఈ శిక్షల్లో భాగంగా సిబ్బందిని మాటలతో వేధించే ప్రయాణీకులపై మూడు నెలల నిషేధం విధిస్తారు. దాడి చేసినట్లు ఉన్న ప్రవర్తనకు 6 నెలలు, చంపుతామని బెదిరిస్తే 2 సంవత్సరాలు లేదా అపరిమితకాలం నిషేధం విధించేలా ప్రతిపాదించింది. విమానం ముఖ్య పైలెట్ ఫిర్యాదు ఆధారంగా ఎయిర్ లైన్స్ కు చెందిన అంతర్గత కమిటీ విచారణ జరిపి 30 రోజుల్లో నిషేధాన కాలపరిమితిని నిర్ణయిస్తుంది. 30 రోజుల్లో అంతర్గత కమిటీ నిర్ణయం తీసుకోకుంటే ఆరోపణలు వచ్చిన ప్రయాణీకులు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని పౌర విమానయాశాఖ ప్రతిపాదించింది.