క్రీడల్లోకి బాలివుడ్ భామ సన్నీ లియోని ఎంట్రీ

SMTV Desk 2017-09-08 18:23:42  bollywood heroine Sunny Leone, Sunny Leone , bollywood news

ముంబై సెప్టెంబర్ 08: బాలీవుడ్‌ సినీ నటులు క్రీడ పోటీలకు సంభంధించే యాజమాన్య హక్కులు తీసుకోవటం ఈ మధ్య ఎక్కువ అయింది. ప్రో కబ్బడ్డి లీగ్ పోటేల్లోఅభిషేక్ బచ్చన్ పింక్ క్ పాంథర్స్ జట్టు ను కొనుగోలు చేసారు. తాజాగా సన్నీ లియోని ఈ జాబితా లోకి చేరింది. కోచి కేంద్రంగా కేరళ కోబ్రాస్‌ అనే ఫ్రాంఛైజీని కొనుగోలు చేశారని ప్రీమియర్‌ ఫుట్సల్‌ తెలిపింది. ఫుట్సల్‌ అంటే మినీ ఫుట్‌బాల్ ఆ జట్టుకు స్వయంగా ఆమే ప్రచారకర్తగా ఉంటారంది. ప్రీమియర్‌ ఫుట్సల్‌ రెండో సీజన్‌ సెప్టెంబర్‌ 15న ముంబయిలో ప్రారంభం అవుతుంది. 17 వరకు అక్కడే తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. రెండో రౌండ్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి 24 వరకు బెంగళూరులో నిర్వహిస్తారు. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 1 వరకు దుబాయ్‌లో ఉంటాయి. కేరళలో సన్నీకి మంచి ఆదరణ ఉంది. అక్కడి యువతకు సన్నీ అంటే పిచ్చి క్రేజ్‌! ఈ మధ్య కేరళలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు వేల మంది తరలివచ్చారు.‌. ఇండోర్‌ స్టేడియంలో ఆడతారు. ఒక్కో జట్టులో కేవలం ఐదుగురే ఉంటారు. లూయిస్‌ ఫిగో, రేయాన్‌ జిగ్స్‌ పాల్‌ స్కూల్స్‌, హెర్నాన్‌ క్రెస్పో, మిచెల్‌ సల్‌గాడో, రొనాల్డినో వంటి సాకర్‌ తారలు తొలి సీజన్‌లో ఆడారు.