రైల్లో బంగారంతో పట్టుబడ్డ ఓ వ్యాపారి

SMTV Desk 2017-09-08 16:31:54  rajadhani express, secendrabad railway station, 4 kgs gold

హైదరాబాద్, సెప్టెంబర్ 08 : సిక్రింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నాలుగున్నర కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. రక్షణ శాఖ కథనం ప్రకారం ఈ నెల 7న రాత్రి సమయంలో సిక్రింద్రాబాద్ చేరుకొని రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అమృత్‌సర్‌కు చెందిన వ్యాపారి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీసులు రైల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా రాజధాని ఎక్స్ ప్రెస్ లో తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారాన్ని అమృత్ సర్ నుంచి బెంగుళూరుకు తరలిస్తున్నట్లు తేలింది. ఈ కేసుకి సంబంధించి రైల్వే పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.