పాకిస్థాన్ బ్యాంకును మూసివేయించిన అమెరికా, రూ. 1500 కోట్ల జరిమానా

SMTV Desk 2017-09-08 13:52:35  Bank of Pakistan, Habib bank, amerika, Habib bank,Qaeda terrorists

అమెరికా, సెప్టెంబర్ 08 : ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా అమెరికాలో నిర్వహిస్తున్న పాకిస్థాన్ హబీబ్ బ్యాంకును బ్యాంకుల నియంత్రణా విభాగం మూసి వేయించింది. 1978లో హబీబ్ తొలి శాఖ యూఎస్ లో ప్రారంభమైంది. ఈ బ్యాంకు నుంచి సౌదీ ప్రైవేట్ బ్యాంక్, అల్ రజాహీ బ్యాంక్ వంటి అల్ ఖైదా ఉగ్రవాదులతో లావాదేవీలు జరిపే బ్యాంకులకు బిలియన్ల కొద్దీ డాలర్లు వెళ్లాయని తేలినట్టు డీఎఫ్ఎస్ అధికారి మారియా ఉల్లో వెల్లడించారు. ఇప్పటీకి కూడా ఈ హబీబ్ బ్యాంకు ద్వారా ఉగ్రవాదులకు నిధులు వెళుతున్నాయన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే బ్యాంకుపై 225 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,500 కోట్లు) జరిమానా విధిస్తున్నట్టు న్యూయార్క్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్న హబీబ్ బ్యాంక్, ఫిర్యాదులు, ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం, ఉగ్రవాదానికి ప్రోత్సహంగా నిలవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది.