మోసగిస్తున్న బిర్యానీ కేంద్రం

SMTV Desk 2017-06-04 17:38:42  biryani with plastic rise, hyderabad,saroornagar,venkateshwara colony,

హైదరాబాద్, జూన్ 4 : ప్లాస్టిక్ బియ్యంతో బిర్యానీ చేశారని అనుమానం వ్యక్తం చేసిన పాపానికి ఓ వినియోగదారునిపై బిర్యానీ కేంద్రం నిర్వాహకులు దాడి చేశారు. అడ్డుపడిన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడారు. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమైండ్ కు తరలించారు హైదరాబాద్ లోని సరూరనగర్ వెంకటేశ్వర కాలనికి చెందిన ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లో పని చేస్తున్న ఇంద్రసేన్ శుక్రవారం రాత్రి భోజనం కోసం స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కనున్న మోడల్ రైతు చికెన్ బజార్ లో బిర్యానీ తీసుకున్నారు. ఇంటికి వెళ్లి తింటుండగా అనుమానం రావడంతో బిర్యనీని ఉండలుగా కట్టి పల్లెం లో కొట్టగా, అది బంతిలాగా ఎగిరిపడుతుండటంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే అడిగేందుకు చికెన్ బజార్ వద్దకు వెళ్ళి బిర్యానీ లో ప్లాస్టిక్ రైస్ ఉందని ప్రశ్శించినందుకు, నిర్వాహకులు శ్రీనివాస్ అతని స్నేహితులు సలీం, రుషి బాధితుడి పై దాడి చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అడ్డుకున్న పోలీసులను దుర్బాషలాడుతూ పోలీసులపై కూడా దాడి చేయబోయారు. దీంతో శ్రీనివాస్ అతని స్నేహితులను అదుపులోనికి తీసుకొని రిమైండ్ కు తరలించామని సరూరనగర్ ఇన్ స్పెక్టర్ లింగయ్య తెలిపారు. ఈ ఘటనకు కారణమైన బిర్యనీని స్వాధీనం చేసుకొని నిధ్ధారణ కోసం పరీక్షకు పంపించామని వివరించాడు. దాడికి పాల్పడ్డ నిందితులు తాగిన మైకంలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.