పాతబస్తిలో నిత్య పెళ్ళికొడుకు..

SMTV Desk 2017-09-08 12:34:01  hyderabad, pathabasthi, crime,

హైదరాబాద్, సెప్టెంబర్ 8: హైదరాబాద్ పాతబస్తీ లో సంతోష్ నగర్ కాలనీ కి చెందిన అన్వర్, షాజిదా బేగం, పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. పెళ్ళైన కొత్తలో కాపురం సజావుగా సాగించాడు. వీరిద్దరి ప్రేమకు చిహ్నంగా ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. గత కొద్ది రోజుల నుండి ఇంటికి రావడం మానేసిన అన్వర్, ఈ క్రమంలో రహస్యంగా వేరే యువతీ తో నిఖా కు సిద్దమయ్యాడు. అయితే ఈ విషయాన్నీ గమనించిన మొదటి భార్య ఐన షాజిదా బేగం, ఆమె బంధువులు, ఫంక్షన్ హాల్ కు చేరుకొని అన్వర్ ను నిలదిస్తూ వాగ్వాదానికి దిగారు. షాజిదా బేగం ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల వారిని శాంతి౦పజేస్తుంటే అన్వర్, వారి బంధువులు పారిపోయారు.