కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి కమాండో ఆచూకీ లభ్యం

SMTV Desk 2017-09-08 12:06:28  soniya gandhi, camando miss, national news, soniya gandhi news

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 08 : సోనియాగాంధి కమెండో అదృశ్యం...సోనియాగాంధీకి రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న కమెండో రాకేశ్ కుమార్ గత వారం నుంచి ఆదృశ్యం కావడంతో దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. కానీ ఆయన అదృశ్యం వెనుక ఓ బలమైన కారణం ఉండడంపై అందరు ఆవేదనకు గురయ్యారు. అసలు విషయంలోకి వెళితే అతని పేరు మీద రూ. 4 లక్షల లోన్ ఉంది. ఆగస్ట్ 31న తన వద్ద ఉన్న రూ. 40 వేలు ఇన్ స్టాల్ మెంట్ కింద కట్టేశాడు. ఆ తర్వాత చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో... ఎవరికీ కనిపించకుండా ఇంటి నుంచి ఓ వారం పాటు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ధనవంతులు ఉండే లుటియన్స్ ప్రాంతంలోని పార్కుల్లో తిరుగుతూ గడిపాడు. చివరకు తినడానికి తిండిలేక, తాగడానికి నీరు లేక అడుక్కుంటుండగా... ఓ వ్యక్తి కంట పట్టాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించడంతో... పోలీసులు వచ్చి, అతడిని స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.