50 వేల కోట్ల వ్యయంతో ఐదు ప్రాజెక్టులు: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

SMTV Desk 2017-09-08 11:15:32  Union Water Resources Minister Nitin Gadkari, On the former Prime Ministers watch

పనాజీ, సెప్టెంబర్ 08 : దేశంలో నదుల అనుసంధానికి సంబంధించి మూడు నెలల్లో 50 వేల కోట్ల రూపాల వ్యయంతో ఐదు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నదుల అనుసంధానం ద్వారా మాజీ ప్రధాని వాజ్ పేయి కళను సాకారం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. జలమార్గలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపిన ఆయన 2018 నాటికి దాదాపు 40 నదీ పోటులు సిద్దమౌతాయని అన్నారు. ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపు 85 లక్షల హెక్టార్లకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించిన గడ్కరీ రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు.