నకిలీ ఓట్లను అరికట్టడానికే ఆధార్ అనుసంధానం

SMTV Desk 2017-09-08 10:58:18  adhar, election commission, election, top news today, bhanwarlal

పాలకొల్లు అర్బన్ సెప్టెంబర్ 7 : పాన్ కార్డుకు, బ్యాంకు ఎకౌంటుకు, మొబైల్ నెంబర్ కు, ప్రభుత్వ సంక్షేమ పధకాలకు ...... ఇలా ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం. కొత్తగా వాటి జాబితాలో ఓటర్ కార్డు కూడా చేర్చనుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడానికి సతీసమేతంగా విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ మీడియా తో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. దీనివల్ల నకిలీ ఓటు వేసేందుకు ఆస్కారం ఉండబోదని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించడంపై ప్రశ్నించగా నంద్యాల ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనూ, కాకినాడ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున ఈ విధంగా జరిగిందని వివరణ ఇచ్చారు.