ఉగ్రవాద సంస్థలపై పాక్ విదేశాంగ మంత్రి హెచ్చరిక

SMTV Desk 2017-09-07 19:43:37  Pakistan Foreign Minister warns of terrorist organizations, Lashkare Taiba, Jaishey Mohammad

ఇస్లామాబాద్, సెప్టెంబర్, 07 : లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలని కట్టడి చేయకపోతే పాకిస్థాన్ ఇక ముందు కూడా అవమానాలని ఎదుర్కోక తప్పదని ఆ దేశ విదేశాంగ శాఖమంత్రి ఖవాజా ఆసిఫ్‌ హెచ్చరించారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ను నిషేధిక ఉగ్రముట జాబితాలో పేర్కొంటూ బ్రిక్స్ దేశాలు చేసిన తీర్మానాని పాకిస్థాన్ ఖడించిన ఆ దేశ విదేశాంగ మంత్రి మాత్రం ఈ మేరకు వాస్తవాలను అంగీకరించారు. ఆ రెండు ఉగ్రసంస్థలు పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆసిఫ్ ఒప్పుకున్నారు. మరిన్ని అవమానాలు ఎదురు కాకుండా చూసేందుకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాదులపై ఆంక్షను విధించి పాక్ లో పరిస్థితిని చక్కదిద్దుకున్నట్లు అంతర్జాతీయ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరు కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న జాతీయ కార్యాచరణ ప్రణాళికను చిత్తశుద్దితో అమలు చేయడం లేదని పాక్ విదేశాంగ మంత్రి బహిరంగంగా అంగీకరించారు.