భూకబ్జాల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం

SMTV Desk 2017-06-04 16:46:34  basthi basthi may bjp, bandaru dathatreaya, hyderabad,

హైదరాబాద్, జూన్‌ 4 : మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండగా రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం భూకబ్జాల్లో మునిగి తేలుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి భూమి లేదంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మియాపూర్ లో కబ్జాకు గురైన భూముల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించాలని డిమాండ్ చేశారు. బస్తీ బస్తీకి బీజేపీ, ఇంటింటికీ మోదీ కార్యక్రమంలో భాగంగా రాంనగర్ లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఇంటింటికి బీజేపి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లే కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందన్నారు. ప్రధాని మోదీ సంస్కరణలు, టెక్నాలజీ ఫలితంగా 50 వేల కోట్ల ప్రజాధనాన్ని కాపాడగలిగామన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా జరుపాలని, మత ప్రాతిపదికన ముస్లీంలకు రిజర్వేషన్లను వ్యతిరేఖిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నగర ఉపాధ్యక్షులు కొండపల్లి మాధవ్, నాయకులు సాయికృష్ణ యాదవ్, రాజ్ కుమార్, వివేక్, మద్దూరి శివాజీ, కలకోట అరుణ్ కుమార్, రాంరెడ్డి, లింగం, రవిచారి, సరళ, మహాలక్ష్మీ, భరత్ గౌడ్, చరణ్ నాయక్, ఉత్తమ్ కుమార్, నేతి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.