పోలీసు కారులోనే పరారైన ఓ మహిళ

SMTV Desk 2017-09-07 16:20:22  United States, A woman arrested, Police car

టెక్సాన్, సెప్టెంబర్ 07 : అమెరికాలో అప్పుడే అరెస్టైన ఓ మహిళ ఏకంగా పోలీసు కారునే దొంగాలించెందుకు యత్నించడం యాక్షన్ సినిమాలోని పతాక సన్నివేశాన్ని తలపించింది. టెక్సాన్ లోని లుష్కిన్ లో చోరికి పాల్పదిందన్న అనుమానంతో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేసి కారులో కూర్చోబెట్టారు. పోలీసులు బయటే ఉండగా వెనుక సీటులో కూర్చున్న మహిళ తనే బెడీలను తొలగించుకుని పరారైంది. వెంటనే పోలీసులు ఆమెను వేరే కారులో వెంబడించారు. 20 నిముషాలు ఉత్కంఠభరితంగా సాగిన ఈ చేజ్ లో పోలీసు కార్లు ఓ దశలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాయి. చివరకు ఎలాగో పోలీసులు ఆ మహిళను అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.