సమస్యలపై జనసేన పోరాటం ...

SMTV Desk 2017-09-07 15:46:24  hyderabad, janasena party, pavar star pavan kalyan, andhrapradesh,

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆక్వాఫుడ్ పార్క్ నుంచి అగ్రికల్చర్ విద్యార్ధుల సమస్యల వరకు పోరాడి గెలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలో ఏపీ రైతుల సమస్యల నుండి ఉద్దానం కిడ్ని బాధితుల సమస్యల వరకు సమర శంఖం పూరించారు. ఏపీ రాజదానిలో గ్రామాల భూ సమీకరణ సమస్యను, ఉద్దండరాయి పాలెం, లింగాల పాలెం రైతులు కలిసి తమ సమస్యలను వివరించగా వారి బాధలను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్ళారు. అంతేకాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం సమస్యల గురించి అక్కడి కిడ్ని బాధితులను పరామర్శించి, ఏపీ ప్రభుత్వాన్ని, కామినేని ని ప్రశ్నించారు. దీనికి గాను వెంటనే ఏపీ ప్రభుత్వం రైతుల, ఉద్దానం సమస్యలను పరిష్కరించింది. ఇటీవల అగ్రికల్చర్ విద్యార్ధుల సమస్యలపై చర్చించగా జీవో నెంబర్ 64 ను ఏపి ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి గాను పవన్ కళ్యాణ్ కు అగ్రికల్చర్ స్టూడెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు.