ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

SMTV Desk 2017-06-04 16:40:57  hyderabad press club, palagummi sainath, 52nd annuvarsery, pressclub

హైదరాబాద్, జూన్‌ 4 : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ 52వ వ్యవస్థాపక దినోత్సవం, తెలంగాణా ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పాత్రికేయులు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ మీడియా, గ్రామీణ ప్రాంత అంశంపై ప్రసంగించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐఅండ్ పిఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్, టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, పుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజమౌళి తో పాటు ఇతర కార్యనిర్వహాక, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.