ట్విట్టర్ లో మిథాలి రాజ్ పై కామెంట్లు

SMTV Desk 2017-09-07 15:10:52  mithali raj, sports, cricket, womens cricket captain

హైదరాబాద్ సెప్టెంబర్ 7 : మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అది నెటిజన్లకు నచ్చలేదు. దాంతో కొందరు నీతిబోదనలు చేయడానికి సిద్దమయ్యారు. మన దేశంలో ఏది మారినా కానీ ఇది మాత్రం మారదు, మనిషిని దుస్తూలతోనే వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారు, ఎప్పటికి ఈ ధోరణి మారుతుందో చూడాలి! ట్విట్టర్ లో మిథాలిని కామెంట్ చేస్తూ పెట్టిన కొన్ని ట్వీట్లు, ‘డిలీట్‌ చేయండి మేడమ్‌. మిమ్మల్ని ఎందరో స్ఫూర్తిగా తీసుకుంటారు,కానీ మీరు వేసుకున్న దుస్తులు బాలేవు’, ‘మీ నుంచి ఇలాంటివి వూహించలేదు. మీపై మీకు ఎలాగో గౌరవం లేదు, కనీసం అభిమానులకు మీపై ఉన్న గౌరవాన్నైనా నిలబెట్టుకోండి’, ‘మిమ్మల్ని ఇలాంటి దుస్తుల్లో చూడలేకపోతున్నాం. భారతీయ యువతిగా అందులోనూ తమిళనాడు యువతిగా ఉండండి’ అంటూ మిథాలీపై ట్వీట్లు గుప్పించారు.