నేను చచ్చిపోయాక ట్వీట్ చేస్తాడా?: మహేష్ కత్తి

SMTV Desk 2017-09-07 14:36:59  pawan kalyan, mahesh katthi, fans wa, pawan fans, mahesh katthi fans

హైదరాబాద్ సెప్టెంబర్ 7 : నేను సామాన్యుడిని నేను సెలబ్రిటీ ని కాదు కానీ మీరె నన్ను సెలబ్రిటీని చేసారని మహేష్ కత్తి పవన్ అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. ‘నేను చేసేది అదే కదా, నేను ప్రశ్నించాకుడద? ఒక నాయకుడిని ఎంతో మంది ప్రశ్నిస్తారు, అలాంటివి చేయవద్దంటే ఎలా?’ అన్నారు. పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించకూడదు...ఒకవేళ ప్రశ్నిస్తే నేనేదో భూతు మాట్లాడినట్టు నాపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించాలని మహేష్ కత్తి డిమాండ్ చేసారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ను అయన అభిమానులు సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్ అని చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తి నాపై అతడి అభిమానులచే ఇంత దాడి జరుగుతుంటే, వేధింపులకు గురి చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు అని మహేష్ కత్తి ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ అయితే ఏంటి? మాట్లాడితే మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటున్నారు. వాళ్లు ఏదో ఫ్యూడల్ లార్డ్ షిప్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అన్ని ఫ్యామిలీల మాదిరే వారిది కూడా ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఎక్కువ మంది నటులు మాత్రమే ఉన్నారు. మెగా ఫ్యామిలీ అనేది రాజుల ఫ్యామిలీ, మనం ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారని మహేష్ కత్తి అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను దారుణంగా వేధిస్తున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు, అలాంటివి చూసి నా కుటుంబ సభ్యులు, కుమారుడు భయ పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్‌కు స్పందించే సమయం లేదా? తన ట్విట్టర్ ద్వారా మహేష్ కత్తినిని వేధించొద్దు అని ఒక్క ట్వీట్ చేయలేడా? ఇంకెప్పుడు ట్వీట్ చేస్తాడు? నేను చచ్చిపోయాక ట్వీట్ చేస్తాడా? అంటూ మహేష్ కత్తి ఆందోళన వ్యక్తం చేశారు.