నా ఆరోగ్యం పై వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం

SMTV Desk 2017-09-07 11:36:56  sp balasubramanyam, balasubramanyam health

హైదరాబాద్ సెప్టెంబర్ 7: సామజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని తన ఆరోగ్యం పై అనేక వదంతులు వస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. కొంచెం దగ్గు, జలుబు కారణంగా డాక్టర్ దగ్గరకు చూపించుకోవడానికి వెళ్ళితే, తన ఆరోగ్యం బాగుండని కారణంగా ప్రదర్శనలు ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోందని, దీనివలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన శ్రేయోభిలాషుల నుంచి తనకు పరామర్శలు వస్తున్నాయని ఇది మరింత బాధను కల్గిస్తున్నాయి అని, ఇలా తన ఆరోగ్యంపై వదంతులు సృష్టించి, ఎందుకు బాధ కల్గిస్తారో అర్థం కావడం లేదని అన్నారు. తన ప్రదర్శనల రద్దుకు కారణం తన సోదరి గిరిజ కన్నుమూయడమేనని, దాదాపు 12 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిందని అన్నారు. ఈ సంఘటన తర్వాత సెప్టెంబరు 2న బెంగళూరులో ప్రదర్శన ఇచ్చానని, ప్రస్తుతం ‘స్వరాభిషేకం’ షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్టు చెప్పారు.