గుర్మీత్ డేరా విలాసాల సామ్రాజ్యం ఇదే..!

SMTV Desk 2017-09-07 11:27:35  Dera Gurmith Baba, Empire, Dera Sacha Sauda Office,Disneyland, Eiffel Tower

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 07 : ఇటీవల ఆత్యాచార కేసులో జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా గుర్మీత్ బాబాకు ఓ ఏడు నక్షత్రాల హోటల్, స్కై బార్, సినిమా హాల్, షాపింగ్ కాంప్లెక్స్, ఫుడ్ కోర్టు, ఇంటర్నేషనల్ స్కూల్, హాస్టల్, ఆసుపత్రి, ఆయుర్వేద ఫార్మసీ... వీటన్నింటినీ కాపాడేందుకు సాయుధులైన గార్డులు. హర్యానాలోని సిర్సా సరిహద్దుల్లో ఉన్నాయి. డేరా సచ్చా సౌధా కార్యాలయంలో గుర్మీత్ ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలివి. ఇవే కాకుండా ఓ డిస్నీ ల్యాండ్, ఈఫిల్ టవర్ లానే ఓ భవనం అందులో సకల సౌకర్యాలు, ఇంకా చెప్పాలంటే చుట్టూ కోటగోడ మధ్యలో ఉన్న అది ఓ ప్రత్యేక రాజ్యం. దానికి రాజు గుర్మీత్. 1990లో డేరా చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత దాని రూపురేఖలను సమూలంగా మార్చేసిన గుర్మీత్ ఆస్తులు, డేరాలోని ఈ నిర్మాణాలను చూసిన అధికారులు ఆరశ్చర్యానికి లోనయ్యారు. తనను తాను ఓ బాబాగా ప్రకటించుకున్న ఆయన, సాంఘిక సంక్షేమం పేరిటా కొన్ని కార్యక్రమాలు చేయడంతో, దేశవ్యాప్తంగా, విదేశాల్లో 5 కోట్ల మంది భక్తులు, అనుచరులను కలిగివున్న గుర్మీత్ ఆశ్రమంపై ప్రస్తుతం పోలీసుల దాడులు జరుగుతున్నాయి. మొత్తం 800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ డేరా ప్రాంతానికి అధికారులు దాడులు నిర్వహించారు. కాగా, ఆయన దత్త పుత్రికగా ప్రపంచానికి పరిమితమైన హనీ ప్రీత్ ఇన్సాన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.