అల్లరి నరేష్ కూడా బిగ్ బాస్ షో కి వెళ్తున్నాడు

SMTV Desk 2017-09-07 11:04:36  allarinaresh,meda meeda abbayi,

హైదరాబాద్ సెప్టెంబర్ 7 : అల్లరి నరేష్ తాజా చిత్రం ‘మెడ మీద అబ్బాయి’, ఈ చిత్ర ప్రమోషన్ లో ఆల్లరి నరేశ్ ‘బిగ్ బాస్’ షో లో పాల్గొననున్నారని సమాచారం. ఇంతకు ముందు రానా , విజయ్ దేవరకొండ మరియు తాప్సీ తమ సినిమాని ప్రచారం చేసుకున్నారు. కాగా ఆ చిత్రాలన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇపుడు అల్లరి నరేశ్ చిత్రం కూడా హిట్ అవుతుందేమో చూడాలి! ఈ ఏపిసోడ్ ఈ రోజు రాత్రికి ప్రచారం కానుంది. . కెరీర్ మొదట్లో మంచి చిత్రాలతో వచ్చి మంచి విజయాలు సొంతం చేసుకున్నాడు, కానీ ఈ మధ్య అల్లరి నరేశ్ సినిమాలు అంతగా ఆదరణ లబించడం లేదు. ఈ చిత్రానికి నిఖిల విమల్ హీరోయిన్ గా నటిచింది. అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది ప్రధాన తారాగణంతో జి ప్రజిత్ దర్శకత్వలో రూపొందింది.