రేపు ఉపాధ్యాయ దినోత్సవం...!

SMTV Desk 2017-09-07 10:30:16  teachers day, sarvepelli radhakrishna, telangan anews

హైదరాబాద్ సెప్టెంబర్ 7:సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ మూర్తి పుట్టిన రోజును మనం టీచర్స్ డే గా జరుపుకుంటాం. అదే రోజున గణేష్ నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాల్సి రావడంతో కొన్ని జిల్లాలకు ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. అలా ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొని జిల్లాలు ఈ నెల 8 తేదిన ఆ వేడుకులను నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో, రేపు ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను నాంపల్లిలోని ప్రియదర్శిని ఆడిటోరియంలో మధ్యహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రమేష్ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పొందిన వారికీ అభినందన సభ ఉంటుందని, తప్పక ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని కోరారు.