ఈ శుక్రవారం వస్తున్న నాగచైతన్య, నరేష్ లు...!

SMTV Desk 2017-09-06 17:37:50  yuddham sharanam, allari naresh, veedevadu, friday releases

హైదరాబాద్ సెప్టెంబర్ 6 : ఈ మధ్య కాలంలో అంతగా నవ్వించ లేకపోతున్నాడు నటుడు నరేశ్, అయన లేటెస్ట్ సినిమా ‘మేడమీద అబ్బాయి’ ఈ శుక్రవారం విడుదలకు సిద్దంగా ఉంది ఇంకో సినిమా నాగ చైతన్య ‘ యుద్దం శరణం ‘ కూడా వస్తుంది. ఇంకా ‘వీడెవడు’ చిత్రం కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ప్రస్తుతం యూత్ అంత అర్జున్ రెడ్డి మాయలో ఉన్నారు. ఇపుడు ఏ సినిమా అయిన హిట్ కొట్టాలంటే అంతకు మించి ఉంటేనే తప్ప ఆడియన్స్ దృష్టి మారదు. ‘యుద్ధం శరణం’ లాంటి సినిమా హిట్ అవ్వాలంటే సినిమాకి మాస్ హీరో అవసరం కానీ నాగ చైతన్య లవర్ బాయ్ గా బాగానే మెప్పించాడు కానీ మాస్ హీరోగా అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఇంతవరకు. ప్రీవియస్ గా చేసిన సినిమా ‘ఆటో నగర్ సూర్య ‘ పవర్ ఫుల్ కథ అయిన నాగ చైతన్య బాగానే నటించాడు, మళ్లి ఆ తరహాలోనే ఈ చిత్రంలో కూడా మెప్పిస్తాడో లేదో చూడాలి మరి. అల్లరి నరేశ్ తన లక్ ను ఈ సారి హైపర్ ఆది తో ప్రయత్నించడానికి వస్తున్నాడు...అయితే ఈ సినిమా ఏ మాత్రం ఇంట్రెస్ట్ ను కల్పించ లేక పోతుంది. వీడెవడు సినిమా గురించి తరువాత మాట్లాడు కుందాం.