డేరా బాబాచే ఇబ్బంది పడుతున్న 1500 మంది ఖైదీలు

SMTV Desk 2017-09-06 16:53:37  Dera Sacha Sauda Chief Gurmite Ram Ramak Singh, Rooh tak,1500 prisoners

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 06 : ఇటీవల ఆత్యాచార కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, రోహ్ తక్ లోని సునియారా జైల్లో ఊచలు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, డేరాబాబా రాకతో అక్కడున్న 1500 మంది ఖైదీలు నానా అవస్థలు పడుతున్నట్లు సమాచారం. అసలు వివరాల్లోకి వెళ్తే, డేరా బాబా వచ్చినప్పటి నుంచి జైల్లో రక్షణశాఖకు అధికారులు పూర్తి బాధ్యతలు ఏర్పాటు చేయలని ఆదేశించడంతో, బందోబస్తును భారీగా పెంచడం జరిగింది. దీంతో పాటు గతంలో మాదిరి లోపల ఖైదీలు తిరిగేందుకు అవకాశం కూడా అధికారులు ఇవ్వకపోవడంతో, బాబా రాక ముందు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు బ్యారక్ ల బయట తిరిగేందుకు అవకాశం ఉండేది. అలాగే, ఖైదీలను కలిసేందుకు వచ్చేవారికి కూడా డేరా బాబా వల్ల నిరాశ ఎదురవుతోంది. తమ వారిని చూసుకునేందుకు కూడా వెనుదిరగాల్సి వస్తుండడంతో, జైల్లోని ఖైదీలంతా డేరా బాబాకు మరొక జైలుకు బదీలి చేయాలని డిమాండ్ చేశారు.