రాజమౌళి మరియు శంకర్ కలిసి వస్తున్నారు

SMTV Desk 2017-09-06 16:53:01  mahesh babu, spyder, murugadas, chennai audio function, rakul preet sing, ar murugadas

హైదరాబాద్ సెప్టెంబర్ 6 : ‘స్పైడర్’ సినిమా ట్రైలర్ తోనే అంచనాలను మరింత పెంచింది. తమిళ దర్శకుడు కావడంతో, ఇపుడు ఈ సినిమా పై తెలుగులోనే కాదు తమిళంలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తమిళంలో భారి ఈవెంట్ ని జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ తమిళ ప్రేక్షకులకు మహేష్ బాబు ని డైరెక్ట్ గా పరిచయం చేయనున్నారు. అయితే ఆ వేడుకకి ముఖ్య అతిథులుగా మన రాజమౌళి ని మరియు తమిళ దర్శకుడు శంకర్ ని ఆహ్వానించి నట్లు తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ వారితో అనుబంధం తో శంకర్ ఈ ఫంక్షన్ కి వెళ్లడానికి అంగీకరించినట్టు సమాచారం. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబందించిన రెండు పాటలను ఆల్రెడీ రిలీజ్ చేసారు. ఈ పాటలకు మంచి రేస్పోన్స్ వస్తుంది. సెప్టెంబర్ 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.