అఖిల ప్రియకు షాక్...

SMTV Desk 2017-09-06 16:51:35  amaravathi, andhrapradesh, akhila priya

అమరావతి, సెప్టెంబర్ 6: సచివాలయంలో ఫోర్జరీ సంతకం కలకలంరేపింది . ఆలీ అనే వ్యక్తి, మంత్రి అఖిల ప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేసి వారంలోగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని, నకిలీ సిఫార్సు లేఖ పట్టుకొని నేరుగా అఖిల ప్రియ వద్దకే వెళ్ళాడు. లేఖలో ఉన్న తన సంతకం కాదని గుర్తించిన అఖిల ప్రియ సచివాలయంలోని ఎస్పిఎఫ్ సిబ్బందికి పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ..."ఇటువంటి సంఘటనలు మళ్ళి జరగకుండా డిపార్టుమెంట్ అప్రమత్తంగా ఉండాలని" ఆదేశించారు.