విఘ్నేశ్వరుని అసలు జన్మస్థలం ఎక్కడుందంటే....

SMTV Desk 2017-09-06 16:23:29  god ganapathi birth place, Doddale area in Uttarakhand, Trigunarayan Temple

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 06 : భారత హిందూ సాంప్రదాయం ప్రకారం మొదట ఏ ప‌ని మొద‌లుపెట్టినా తొలి పూజ‌లు చేసేది గణపతికే. మరి అంతటి దైవ నాథుని అసలు జన్మ స్థలం తెలుసుకోవాలని ఉంటుంది కదా.. అయితే, ఆయ‌న‌ జ‌న్మ‌స్థ‌లం గురించి మాత్రం అంత‌గా ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ గ‌ణ‌నాథుడు ఉత్తరాఖండ్‌లోని డోడితాల్ ప్రాంతంలో జ‌న్మించాడని అక్క‌డివాసుల విశ్వాసం. అలాగే శివపార్వతులు ఆ రాష్ట్రంలోని త్రియుగినారాయణ్ ఆలయంలో వివాహం చేసుకున్నారని స్థల పురాణాలు చెబుతున్నాయి. అక్క‌డి మున్‌కటియా అనే ప్రాంతంలోనే వినాయ‌కుడిపై ఆగ్ర‌హం తెచ్చుకున్న శివుడు ఆయ‌న‌ తల నరికాడు. అందుకే కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు ముందుగా మున్‌క‌టియాలోని గ‌ణేశుడిని దర్శిచుకొని తర్వాత పార్వతీ దేవి వినాయకుడికి రూపమిచ్చిన ప్రాంతం ఉత్తరకాశీ జిల్లాలోని రుద్ర ప్ర‌యాగ్‌కి స‌మీపంలోని కైలాశు ప్రాంతంలో గల డోడితాల్ అని చెబుతుంటారు. అక్క‌డి ప్రజలు ఇక్కడ గ‌ణేశుడిని డోడీ రాజుగా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో క‌ప్ప‌బ‌డి ఉండటంతో, కేవలం వేసవిలో మాత్రమే దర్శించుకోగలం.