కేసీఆర్ కంటి ఆపరేషన్ సక్సెస్

SMTV Desk 2017-09-06 13:14:49  kcr, kcr eye oparetion, kcr oparetion, telnagana cm kcr

ఢిల్లీ సెప్టెంబర్ 6: కంటి సమస్య తో బాధపడుతున్న కేసీఆర్ గతంలో ఆపరేషన్ నిమిత్తం ఢిల్లీ కి వెళ్లినా రాజకీయ కార్యక్రమాల నేపథ్యంలో ఆపరేషన్ చేయడం కుదరలేదు. అయితే ఈ కార్యక్రమం కేసీఆర్ బిజీ షెడ్యుల్ దృష్ట్యా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సారి శనివారం అరుణ్ జైట్లీ తో భేటీ అనంతరం ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఆపరేషన్ నిమిత్తం రెస్ట్ తీసుకోన్నారు. రెస్ట్ తర్వాత ఆయన ఎడమ కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ డాక్టర్ సచ్ దేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారంటూ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. డాక్టర్ సచ్ దేవ్ కు ధన్యవాదాలు తెలిపారు.