బాణసంచా పేలుడుతో లక్షల నష్టం ...

SMTV Desk 2017-09-06 13:05:37  guntur, mangalagiri, chinakakani,

గుంటూరు, సెప్టెంబర్ 6: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాయక ఫైర్ వర్క్స్ బాణసంచా గౌడన్ లో పేలుడు స౦భవించింది. గౌడన్ లో టపాసులు పేలడంతో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకు వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ పేలుడు సంభవించిందని, దీంతో దాదాపు 6 లక్షల నష్టం జరిగిందని షాప్ యాజమాన్యం తెలిపారు. ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతే కాదు ట్రాఫిక్ అంతరాయం కాకుండా చర్యలు చేపట్టారు.