శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఉపరాష్ట్రపతికి జేడీయూ నేతల వినతి

SMTV Desk 2017-09-06 12:42:32  Vice-Chairman, Rajya Sabha chairman Venkiah Naidu,JDU former president Sharad Yadav, bihar cm nithish kumar

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 06 : జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఆర్పీ సింగ్ పేరును నితీశ్ ప్రతిపాదించారు. దీంతో శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో బీజేపీతో నితీష్ కుమార్ జతకట్టడాన్ని నిరసిస్తూ... కొత్త పార్టీ పెట్టే యోచనలో శరద్ యాదవ్ ఉన్నట్లు సమాచారం.