వరుస పేలుళ్ళ తో వణికిస్తున్న గ్యాస్ సిలిండర్లు..

SMTV Desk 2017-09-06 12:02:40  kadapa, rajampet, nunevaripalle

కడప, సెప్టెంబర్ 6: మొన్న హైదరాబాద్, నిన్న భువనగిరి, నేడు కడప జిల్లా రాజంపేట మండలం నునేవారిపల్లె లో ఓ ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో, ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు దాటికి ఇల్లు మొత్తం ద్వంసం అయింది. ఈ ఘటనతో చుట్టుపక్కన ఉన్నవాళ్లు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.