‘సైరా..’ కోసం ‘రామ్‌ లీలా’ చిత్రం కాస్ట్యూమ్‌ డిజైనర్‌

SMTV Desk 2017-09-06 11:27:13  megastar, chiranjeevi, ramcharan, pragya jaiswal, sairaa narsimhareddy

హైదరాబాద్ సెప్టెంబర్ 6 : మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం టాప్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా అంజు మోది ని తీసుకోనున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘రామ్‌ లీలా’ చిత్రాలకు అంజు మోదీ గారే పనిచేసారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో ఉన్నారని, చిరంజీవికి లుక్ టెస్ట్ జరుగుతోందని సమాచారం. అయితే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌ గ పనిచేస్తునారట. అలాగే మరో పది మంది దుస్తుల డిజైన్‌ కోసం పరిశోధన చేస్తున్నట్లు సమాచారం. సినిమాని ఎంతో నేచురల్ గ తీయాలని సినిమా యూనిట్ స్వాతంత్య్రానికి ముందు ఉన్న సంస్కృతి, అప్పటి వస్త్రాధారణ గురించి కూడా పరిశోధిస్తున్నారట. ‘సైరా..’ కోసం ఒక భారి సెట్ కేరళలోని పోల్లంచిలో వేస్తున్నారు. హీరోయిన్ గా నయనతార చేస్తున్నారు, ఇంకా అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, ప్రజ్ఞ జైస్వాల్, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.