దూసుకొస్తున్న ఇర్మా హరికేన్ తుఫాన్...

SMTV Desk 2017-09-06 11:26:27  america, texas, harvey hariken, harvey thufan, trump, irma hariken,

అమెరికా, సెప్టెంబర్ 6: అమెరికా వరుస తుఫాన్లతో విలవిలలాడుతుంది. గత కొద్ది రోజులుగా హర్వే హరికేన్ తుఫాన్ కు హ్యూస్టన్, టెక్సాస్ నగర వాసులు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ భారి హార్వే హరికేన్ ఉదృతి తగ్గకముందే ఇర్మా హరికేన్ తుఫాన్ దుసుకోస్తుంది. ఫ్లారిడాకు దక్షిణాన అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడ్డ ఈ భారీ తుఫాన్ కు ఇర్మా హరికేన్ గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ గంటకు 280 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, 10 నుంచి 12 సెం. మీ ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దక్షిణ తీరంలో ఆపార నష్టం జరగనుందని హెచ్చరికలు జారీ చేశారు. కరేబియా, వెస్టిండీస్ దీవుల్లో, ఫ్లారిడాలో తుఫాన్ ప్రభావం ఉంటుందని గుర్తించిన అధికారులు ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారు.