హైదరాబాద్ ను అలుముకున్న క్యుములోనింబస్ మేఘాలు

SMTV Desk 2017-09-06 10:47:13  Hyderabad, Meteorological Department,

హైదరాబాద్, సెప్టెంబర్ 6: గత కొద్ది రోజులుగా సూర్యుడు బగ బగ మండుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు ఉపరితలం ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్ర లలో మరో 48 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారి వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే భాగ్యనగరం అంతటా దట్టమైన మేఘాలు అలుముకొగ, ఎల్బీ నగర్, కొత్తపేట, హయత్ నగర్, లో భారీ వర్షాలు కురుస్తుండటంతో, పలు ప్రాంతాల్లో విధ్యుత్ సరఫరా నిలిచిపోయింది. మహానగరం లో వాహనదారులు పట్టపగలే లైట్ లు వేసుకొని వెళ్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగా వినాయకుని నిమజ్జనానికి ఆటంకం కలుగుతుంది. హైదరబాద్ తో సహ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారి వర్షాలు కురుస్తున్నాయి.