హనీ..హనీ అని జపం చేస్తున్న డేరా బాబా...!

SMTV Desk 2017-09-05 14:33:35  gurmeeth singh, rohthak, baba gurmeeth singh, haryana, panjab

రోహ్ తక్, సెప్టెంబర్ 5: రోహ్ తక్ జైలులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నడేరా బాబా గుర్మీత్ సింగ్ తన దత్త పుత్రిక అయిన హనీప్రీత్ సింగ్ నామాన్ని జపం చేస్తున్నాడు. హనీ...హనీ...ఎక్కడున్నావ్? అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడని తెలుస్తోంది. బాబా ముసుగులో సర్వ సౌఖ్యాలు అనుభవించి, పూజలందుకున్న, ఇద్దరు సాధ్వీలను రేప్ చేసిన గుర్మీత్ రాం రహీం సింగ్ జైలులో గగ్గోలు పెడుతున్నాడు. డేరా బాబా కార్యక్రమాలన్నీ సయుంక్తంగా పర్యవేక్షించే హనీప్రీత్...వారిద్దరి బంధం అసహజమైనదని ఆమె భర్తతో పాటు, పలువురు ఉద్యోగులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యను కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడని గుర్మీత్..హనీ నామజపం చేస్తున్నాడని ఖైదీలు చెబుతున్నారు. అలాగే హనీప్రీత్‌ తల్లి నసీబ్ కౌర్‌ ను కూడా కలవాలని భావిస్తున్నాడు. తన కుమారుడు జస్మీత్, కుమార్తెలు చరణ్ ప్రీత్, అమర్ ప్రీత్, అల్లుళ్లు షాన్ ఏ మీత్, రూహ్ ఏ మీత్, డేరా చైర్మన్ విపాసన, అనుచరుడు దాన్‌ సింగ్‌ లను కూడా కలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.