పార్టీ అయితే ఓకే..కానీ నాయకులే వీక్..సర్వేలో నిగ్గుతేల్చిన నిజాలివే...!

SMTV Desk 2017-09-05 13:52:34  trs party, trs sarvey, kcr servey, kcr secret servey

హైదరాబాద్ సెప్టెంబర్5: ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది..? నాయకుల పని తీరు ఏ విధంగా ఉంది..? ప్రజలు పార్టీ పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా..? రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న నాయకులకే ఓటు వేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో రహస్య సర్వేను జరిపించారు. ఇప్పటివరకు జరిపించిన రెండు సర్వే ఫలితాలను బహిర్గతం చేయగా, ఈ సారి మాత్రం సర్వే వివరాలను రహస్యంగా ఉంచారు. కానీ అంతర్గతంగా దీనికి సంబంధించిన కొంత సమాచారం మాత్రం తెలిసింది. అదేంటంటే.. ఈ సర్వేలో ప్రజలు పార్టీ పట్ల, పార్టీ ఆలోచనల పట్ల సుముఖంగా ఉన్నా, నాయకుల పట్ల మాత్రం విముఖతగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సర్వేలో ప్రజలు కొంత మంది ఎంపీ, శాసన సభ్యుల పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఈ సర్వే జరిపించినట్లు తెలుస్తుంది. పార్టీని మరింత పటిష్ట పరచుకోవాలని భావిస్తున్న కేసీఆర్ ఈ సర్వే ఆధారంగా నాయకుల పనితీరుపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదో ఈ సర్వే తోనే కేసీఆర్ అంతిమ నిర్ణయానికి వస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.