ఉత్తరకొరియా పై నిక్కీ హేలీ స్పందన

SMTV Desk 2017-09-05 13:33:59  Nuclear test, Missile test, North Korea, Nicky Hayley, the US ambassador

ఐరాస, సెప్టెంబర్, 05 : శక్తి వంతమైన అణు పరీక్ష సహా వరుస క్షిపణి పరీక్షలతో అలజడి రేపుతున్న ఉత్తరకొరియా పై అత్యంత కఠిన ఆంక్షలు విధించాలని రష్యా చైనా మినహా ఇతర దేశాలు ఐరాస భద్రత మండలిని అభ్యర్ధించాయి. ఆదివారం ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పర్యక్షించిన నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన భద్రత మండలిలో సభ్యదేశాల్లో ఈ మేరకు వాదనలు వినిపించాయి. ఉత్తరకొరియాను కట్టడి చేసే విషయంలో తాత్సారం తగదన్న అమెరికా ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు సాగించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ సైతం ఉత్తరకొరియా పై కఠిన ఆంక్షల విధింపునకు డిమాండ్ చేశాయి. అయితే, సమస్య పరిష్కారానికి ఉత్తరకొరియాతో చర్చలే మార్గమన్న రష్యా, చైనా విముఖ వ్యూహాన్ని ప్రతిపాదించాయి. ఉత్తరకొరియా అణు పరీక్షలు క్షిపణి పరీక్షలు నిలిపివేస్తేనే ప్రతీకగా అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు చేయడం మానుకోవాలంటూ అమెరికా రాయబారైన నిక్కీ హేలీ వెల్లడించారు.