గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సాప్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

SMTV Desk 2017-09-05 12:19:37  Supreme Court, Google, Yahoo, Facebook, Watsap,Justice Madan B. Lokur, Social media

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 05 : దేశ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్, యాహూ, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో జరుగుతున్న రేప్, గ్యాంగ్‌రేప్ వీడియోల అప్‌లోడింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల వివరాలను తమ ముందు ఉంచాల్సిందిగా ఆదేశాలు రావడంతో, గతేడాది నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు దీనికి సంబంధించి తీసుకున్న వివరాలను తమకు తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు కోరింది. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పీఓసీఎస్ఓ) 2012 చట్టం కింద ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలపాలని జస్టిస్ మదన్ బి లోకూర్, యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం హోమంత్రిత్వ శాఖను ఆదేశించడం జరిగింది.