గౌతమ్ రెడ్డి కి వంగవీటి రాధాకృష్ణ ఎన్ కౌంటర్

SMTV Desk 2017-09-04 17:31:28  vijayawada, vangaveeti ranga, vangaveeti radha krishna, goutham reddy,

విజయవాడ, సెప్టెంబర్ 4: గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలకు బెజవాడ అట్టుడుకుతుంది. వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డిపై వంగవీటి రాధాకృష్ణ స్పందిస్తూ... వంగవీటి రంగా మరియు రాధా గారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రంగా గారి అభిమానులు ఊరుకోమని, గౌతమ్ రెడ్డిని వైసిపి నుండి తొలగించడం పార్టీకే మంచిదని, గౌతమ్ రెడ్డి రెండు హత్య కేసుల్లో నిందితుడు కాగా, ల్యాండ్ మాఫియాతో కూడా సంబందాలు ఉన్నాయి. నగర బహిష్కరణకు గురైన గౌతమ్ రెడ్డికి రంగా గారి గురించి మాట్లాడే అర్హత లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.