ప్లే స్కూల్ పై కప్పు కూలడంతో మూడేళ్ళ బాలుడు మృతి ...

SMTV Desk 2017-09-04 16:47:40   visakapatnam, vizag, vishalakshinagar, surya chra play scool

విశాఖపట్టణం, సెప్టెంబర్ 4: విశాఖజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విశాలాక్షి నగర్ లో సూర్యచంద్ర ప్లే స్కూల్ లో గౌతమ్ అనే మూడేళ్ళ బాలుడు మృతి చెందాడు. సూర్యచంద్ర ప్లే స్కూల్ లో స్లాబ్ కూలి గౌతమ్ మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతమ్ మృతిపై బంధువులు మాట్లాడుతూ... ఎటువంటి నియమాలు, ప్రమాణాలు పాటించకుండా రన్ చేస్తున్న స్కూల్ యాజమాన్యన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను కోరారు. స్కూల్ యాజమాన్యం కట్టకుండా వదిలేసిన గోడ వల్ల గౌతమ్ చనిపోయాడు. ఈ విధంగా ఏ పిల్లలకు జరగకుడదు ఏ తల్లికి పుత్రశోకం మిగలకూడదని గౌతమ్ తల్లితండ్రులు బోరున విలపించారు.