హైదరాబాద్, సెప్టెంబర్ 4: రెండు రోజుల క్రితం పుట్టిన రోజు జరుపుకున్న పవన్ కళ్యాణ్ కు మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా.. మా అన్నయ్య చిరంజీవికి నటుడిగా ఎంత ఫాలోయింగ్ ఉందో, కల్యాణ్ బాబు నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అభిమానులు ఉన్నారు. పవన్ ప్రజల్లో తిరిగి చేసిన పనులే ఈ రోజు వారి గుండెల్లో నిలిచిపోవడానికి కారణమయ్యాయి. నాకు తెలిసినంతవరకు టాలీవుడ్‌లో పవన్ ఫాలోయింగ్ ఇతరులెవరికీ లేదని వ్యాఖ్యానించారు. కాగా, మెగా ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉంటారని, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్సేనని నాగబాబు అన్నారు. ఇక, విమర్శకుల విషయానికి వస్తే...మనం అలాగే వదిలేస్తే, తప్పు మనదే అవుతుంది. మనల్ని ఎవడన్నా తిడుతోంటే భరించడం తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు.